రంజాన్ మాసం సందర్భంగా హలీమ్ తయారీకి మాంసం వినియోగం పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో దొంగిలించిన పశువులను అక్రమంగా వధించి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో పశువులను కట్టేసి ఉంచిన యజమానులు ఉదయం అవి కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సీసీటీవీల్లో దొంగతనం దృశ్యాలు రికార్డ్ అయినా, ముసుగులు ధరించిన దుండగుల వల్ల పోలీసుల దర్యాప్తు కష్టతరంగా మారింది. పోలీసులు రాత్రి పహారా పెంచామని చెబుతున్నా, చోరీలు ఆగడం లేదు.