AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిలయన్స్ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని, ఐఏఎస్ఏకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్రానికి సహకారంపై మార్గనిర్దేశం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.