దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ 466 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. పడిక్కల్ 62 పరుగులు చేయగా, కెప్టెన్ తిలక్ వర్మ(56*) అర్ధసెంచరీ సాధించారు. షమీ, ముకేశ్ చెరో 2 వికెట్లు తీయగా, ఖురేషీ, శిఖర్ తలో వికెట్ పడగొట్టారు. రేపు మిగిలిన 4 వికెట్లు తీసి సౌత్ జోన్ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్సులో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేసింది.