రాయ్‌పుర్ వేదికగా జింబాబ్వే, భారత మహిళల జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రంగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.