ఇంగ్లాండ్‌తో మూడో టీ20.. వైభవ్ సూర్యవంశీకి స్వల్ప గాయం

ఇంగ్లాండ్‌తో మూడో టీ20కి ముందు భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఛాతిపై బంతి తాకి స్వల్పంగా గాయపడ్డాడు. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం కొద్దిసేపటికే మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించడంతో అతడికి ఎలాంటి తీవ్రమైన గాయం లేదని మేనేజ్‌మెంట్ వర్గాలు వివరించాయి. దీంతో భారత శిబిరంలో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. నాటింగ్హమ్‌లో జరిగే మూడో టీ20లో వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయమని, ఈ మ్యాచ్‌లో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయని మేనేజ్‌మెంట్ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్