భారత్‌తో మూడో టెస్ట్ డే-2 లంచ్‌ బ్రేక్‌.. బుమ్రాకు 3 వికెట్లు (వీడియో)

అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టు కొనసాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 251/4తో రెండో రోజు బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌.. భోజన విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. తొలి సెషన్‌ ప్రారంభించిన కాసేపటికే స్టోక్స్‌(44), జో రూట్‌(104), క్రిస్ వోక్స్‌(0) ఔటయ్యారు. ఈ ముగ్గురి వికెట్లూ బుమ్రాకే దక్కడం విశేషం. ప్రస్తుతం క్రీజులో జెమీ స్మిత్‌(51), బ్రైడన్‌ కార్స్ (33) ఉన్నారు.

Credits: JIOHOTSTAR

సంబంధిత పోస్ట్