భారత్‌తో మూడో టెస్ట్.. టీ బ్రేక్‌కి ఇంగ్లండ్‌ స్కోర్ 153/2

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ టీ బ్రేక్‌ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. జో రూట్‌ (54*) అర్ధశతకం పూర్తి చేసుకోగా, ఓలీ పోప్‌ (44*) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (18), బెన్‌ డకెట్‌ (23) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్‌ రెడ్డి 2 వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్