అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడో టెస్టు కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్ రెడ్డి తన మాయాజాలంతో ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18), బెన్ డకెట్ (23)లను తక్కువ పరుగులకే ఔట్ చేశారు. ప్రస్తుతం జో రూట్ (24*), ఓలీ పోప్ (12*) పరుగులతో క్రీజులో ఉన్నారు.