ఈ అమ్మవారి దర్శనం ఏడాదికి 15 రోజులు మాత్రమే

కర్ణాటకలోని హాసన్ పట్టణంలో కొలువై ఉన్న హాసనాంబ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ అమ్మవారు ఏడాదిలో ఆశ్వయుజ మాసంలో కేవలం 15 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. ఆలయాన్ని మూసేటప్పుడు వెలిగించిన దీపం, అమ్మవారి పాదాల వద్ద ఉంచిన పువ్వులు మరుసటి ఏడాది తెరిచే వరకు అలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 12వ శతాబ్దపు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, సప్తమాతృకలు ఇక్కడ చీమల పుట్టల్లో, బావుల్లో స్థిరపడినట్లు భక్తుల విశ్వాసం. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత గురువారం ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕