ఇది ‘ఎగిరే వైట్‌హౌస్‌’.. ఖతార్‌ గిఫ్ట్‌పై ట్రంప్‌ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ పాలకులు బహుమతిగా ఇచ్చిన 747 జంబో జెట్ విమానాన్ని ఆవిష్కరించారు. దీనిని 'ఎగిరే వైట్‌హౌస్'గా అభివర్ణించిన ట్రంప్, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానమని పేర్కొన్నారు. జాయింట్‌ బేస్ ఆండ్రూస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, విమానం ఇంటీరియర్ డిజైన్, ఇంజిన్ల నాణ్యతను ప్రశంసించారు. ఇది ఎయిర్‌ఫోర్స్ వన్ కంటే వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. జులై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య వేడుకల్లో విమానాల ప్రదర్శనలో ఇది పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్