‘కాకా’లో చిరు పాత్ర ఇదే.. స్వయంగా లీక్ చేసిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ అలియాస్ ‘సత్యం’ అనే రెండు విభిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఒక ఆక్వా ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా, మరోవైపు అండర్‌వాల్డ్‌ను శాసించే శక్తిమంతమైన పాత్రలో ఆయన నటన ఆకట్టుకోనుంది. తండ్రీకూతుళ్ల మధ్య సాగే భావోద్వేగభరితమైన కథనం సినిమాకు ప్రాణం పోయనుంది. చిరంజీవి కూతురుగా మలయాళ నటి అనసూయ రాజన్ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕