జపనీస్ మింట్ ఆకుల నుండి తీసే నూనెకి మార్కెట్ డిమాండ్ ఎక్కువ. దీని నూనె సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య, ఔషధ ఉత్పత్తుల్లో ఉపయోగపడుతుంది. దీన్ని సాగుచేయాలంటే ముందుగా.. పొలంలో ఎత్తుమడులు చేసి, మొక్కల మధ్య, వరుసల మధ్య 40 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. విత్తనం నాటిన 120 రోజుల తర్వాత మొదటి కోత వస్తుంది. కోత తర్వాత సరైన పోషకాలు అందించాలి. ఎకరానికి 25 కిలోల నత్రజని, 15 కిలోల భాస్పరం, 10 కిలోల పోటాష్ ఎరువులు వాడితే అధిక దిగుబడి లభిస్తుంది. ఒక ఎకరా నుంచి 70–80 కిలోల నూనె సేకరించవచ్చు.