కోటా శ్రీనివాసరావు చివరిసారి 2023 మార్చి 11న విడుదలైన ‘దోచేవారెవరురా’ సినిమాలో నటించారు. అదే ఏడాది వచ్చిన ‘కబ్జా’ చిత్రంలోనూ ఆయన కనిపించారు. వయసు పెరిగిన తరువాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ 'హరిహర వీరమల్లు' కోట ఓ చిన్న పాత్ర పోషించారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మరో పది రోజుల్లో వీరమల్లు చిత్రం విడుదల కానుండగా.. ఇంతలో కోట మృతిచెందడం విషాదకరంగా మారింది.