AP: పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'కొందరు అహంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కళ్లు మూసి తెరిచేలోపు 9 నెలలు గడిచాయి. మిగిలిన నాలుగేళ్లు ఇంకెంత? ఆ తర్వాత మళ్ళీ మాదే అధికారం వస్తుందని నాగబాబు అన్నారు. ఇటువంటి హాస్యగాడిని చూడలేం. మరో ఇరవై ఏళ్ల పాటు ఇలాగే పడుకోండి. ఆయనకు ఇదే నా సలహా' అని తెలిపారు.