TG: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీరుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండానే ప్రభుత్వం హియరింగ్ చేపడుతోందని అన్నారు. డిపిఆర్ సిద్ధం చేయకుండానే బిడ్లను ఆహ్వానిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది తుగ్లక్ పాలన కాక మరేమిటి అంటూ ఎక్స్ వేదికగా ఫైరయ్యారు.