యువత కలలను సాకారం చేసే బడ్జెట్ ఇదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశాం. మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ ఇది. మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి బాటలు వేశాం. చిరు వ్యాపారులు, MSME ల అభివృద్ధికి కొత్తబాటలు వేశాం. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.