కోట శ్రీనివాసరావు అనారోగ్యం కారణంగా చాలా రోజులుగా మీడియాలో పెద్దగా కనిపించలేదు. గత నెల 9వ తేదీన నిర్మాత బండ్ల గణేశ్ కోటా ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కోటాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కోటాను చూసి అభిమానులు షాక్ అయ్యారు. డయాబెటిస్ కారణంగా వైద్యులు కోటా కాలి వేలిని తొలగించిన విషయం తెలిసిందే.