ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 'యశోద కృష్ణ' ఆయిల్ పెయింటింగ్ రికార్డు స్థాయిలో రూ.167.2 కోట్లకు అమ్ముడైంది. ముంబైలో 'సాఫ్రాన్‌ఆర్ట్' నిర్వహించిన వేలంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారతీయ కళాకృతుల వేలంలో కొత్త రికార్డు నమోదైంది. 1890లలో రూపొందిన ఈ చిత్రంలో యశోద, చిన్నారి కృష్ణుడి మధ్య ఉన్న మమతను అద్భుతంగా ప్రతిబింబించారు. గతంలో హుస్సేన్ గీసిన 'అన్‌టైటిల్డ్' అనే చిత్రం రూ.118 కోట్లకు అమ్ముడైంది.