బట్టలు ఉతికిన తర్వాత మంచి సువాసన, మృదుత్వం కోసం వాడే ఫ్యాబ్రిక్ కండిషనర్లను, ముఖ్యంగా కంఫర్ట్‌ను వాషింగ్ మెషీన్లో సరైన సమయంలో వేయడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం.. టాప్ లోడ్ మెషీన్లలో రిన్స్ సైకిల్ సమయంలో, ఫ్రంట్ లోడ్ మెషీన్లలో వాషింగ్ ప్రారంభంలో లేదా రిన్స్ సైకిల్ సమయంలో వేయాలి. నేరుగా బట్టలపై పోయడం, మోతాదుకు మించి వాడటం, స్పోర్ట్స్ వేర్, మైక్రోఫైబర్ టవళ్లు, బేబీ వేర్ వంటి వాటికి వాడకపోవడం మంచిది. ఫ్రంట్ లోడ్ మెషీన్లలో డిస్పెన్సర్ బాక్స్‌ను నెలకు ఒకసారి శుభ్రం చేయాలి.