ఫిష్ వెంకట్ అసలు పేరు ఇదే

సినీనటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్‌. ముషీరాబాద్‌ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్‌ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్‌, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు తదితర హిట్‌ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్