ఏపీలోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1943 జూన్ 8న జన్మించిన యర్రా శేషగిరిరావు అలియాస్ గిరిబాబు, తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయన, మద్రాసులో ఎన్నో ప్రయత్నాల తర్వాత 1973లో 'జగమే మాయ' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'నోము' సినిమాలో విలన్గా పోషించిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వరుస విజయాలతో ఆయన నటుడిగా ఎదిగి, చిత్రసీమలో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.