షాపింగ్ మాల్స్ లేదా పెద్ద షోరూమ్‌ల ద్వారాల వద్ద మనపైకి వచ్చే వేగవంతమైన గాలి వెనుక 'ఎయిర్ కర్టెన్' అనే పరికరం ఉంటుంది. ఇది లోపలి చల్లదనాన్ని కాపాడుతూ, బయటి వేడి గాలి, దుమ్ము, కీటకాలు లోపలికి రాకుండా అదృశ్య గోడలా పనిచేస్తుంది. దీనివల్ల కాలుష్యం, కీటకాల నుండి రక్షణతో పాటు విద్యుత్ ఆదా కూడా అవుతుందని, కస్టమర్ల రాకపోకలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.