అయోధ్యలో దీపోత్సవం ముగిసిన తర్వాత ఇదీ పరిస్థితి!

అయోధ్యలో సోమవారం దీపోత్సవం వైభవంగా జరిగింది. అయితే దీపోత్సవం ముగిసిన తర్వాత.. మిగిలిపోయిన దీపాల నూనెను వందలాది మంది స్థానిక ప్రజలు బాటిళ్లలో నింపుకొని తీసుకెళ్లారు. దేశంలో సామాన్యుల దుర్భర పరిస్థితికి ఇది నిదర్శనమని, దీపోత్సవంతో రికార్డు సృష్టించినా పేదల జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇలా చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు.

సంబంధిత పోస్ట్