చాందీపుర వైరస్‌కు చికిత్సా విధానం ఇదే!

చాందీపుర వైరస్ నిర్ధారణకు రక్తం లేదా మెదడు ద్రవం నమూనాలపై RT-PCR లేదా IgM ELISA పరీక్షలు నిర్వహిస్తారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) వంటి ప్రత్యేక ల్యాబ్‌ల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్‌కు ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ మందులు లేవు. వ్యాధి తీవ్రతను బట్టి ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్, ద్రవాలు అందిస్తూ, మూర్ఛలు, మెదడు వాపును నియంత్రించే లక్షణ ఆధారిత చికిత్స అందిస్తారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం అందిస్తే మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్