కేరళలోని అంబళప్పుళ శ్రీకృష్ణస్వామి ఆలయం వైష్ణవుల 108 ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్థలపురాణం ప్రకారం.. చెంబకచ్చేరి రాజు చదరంగంలో కృష్ణుడి చేతిలో ఓడి, 64 గళ్లకు రెట్టింపు చొప్పున బియ్యం ఇవ్వాల్సి వచ్చిందట. బియ్యం అప్పు తీరనంతగా ఉండటంతో కృష్ణుడు ప్రత్యక్షమై ఆలయం నిర్మించి, ఆ బియ్యంతో పాలపాయసం తయారు చేసి భక్తులకు పంచాలని ఆదేశించాడట. అప్పటి నుంచి ఇక్కడ ప్రత్యేక గులాబీ రంగు బియ్యం, ఆవు పాలు, చక్కెరతో ఆరేడు గంటలపాటు పాలపాయసం మరిగించి తయారు చేసి స్వామికి నివేదిస్తారు. ఈ పాయసం స్వీకరించేందుకు గురువాయూర్ నుంచి శ్రీకృష్ణుడే వస్తాడనే విశ్వాసం ఉంది. #Hidden Secrets of Telugu Temples