71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాల్లో టాలీవుడ్ ఉత్తమ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు దక్కించుకుంది. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ‘ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపికవడం ఎంతో గర్వకారణం. ఈ గౌరవం మా చిత్ర బృందానికే చెందుతుంది. అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తిమంతమైన కథలు అందించాలన్న మా తపనను రెట్టింపు చేస్తోంది’ అని పేర్కొన్నారు.