ఈ స్కూటీ ఫీచర్లు మామూలుగా లేవుగా.. 3 సెకన్లలో 60 కి.మీ స్పీడ్

దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ సరికొత్త టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటీని ఆవిష్కరించింది. 20 HP మోటార్‌తో, ఇది కేవలం 2.9 సెకన్లలో 0-60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జ్‌తో 261 కిమీ ప్రయాణించగలదు. 30 నిమిషాల్లో 80% బ్యాటరీ ఛార్జింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ABS వంటి ఫీచర్లున్నాయి. ధర రూ. 1.2 లక్షల నుండి రూ. 1.45 లక్షల మధ్య ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటీలో సీటు తెరవడానికి ఫిజికల్ కీ అవసరం లేదు. స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. సీటు కింద 34 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

సంబంధిత పోస్ట్