తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు!

పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్దల మాత్రను సగానికి విరిచి ఇవ్వడం సురక్షితం కాదని శిశువైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మందుల మోతాదు వారి వయస్సుతో పాటు బరువు, ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రత ఆధారంగా నిర్ణయిస్తారు. మాత్రను విరిచినప్పుడు మందు సమానంగా విభజించబడకపోవడంతో ఓవర్‌డోస్ లేదా అండర్‌డోస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా CR, SR, MR వంటి ప్రత్యేక పూత ఉన్న మాత్రలను విరిస్తే మందు ఒక్కసారిగా శరీరంలోకి విడుదలై తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించవచ్చు. పిల్లలకు ఎల్లప్పుడూ వారి కోసం ప్రత్యేకంగా తయారైన సిరప్‌లు లేదా పెడియాట్రిక్ మందులనే, వైద్యుల సూచన మేరకే ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్