నటుడు కోట శ్రీనివాసరావు మొత్తం జీవితంలో కోల్పోయిన విషయాలు రెండున్నాయని ఆయన తెలిపారు. "ఒకటి షూటింగ్స్ కారణంగా సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చట చూసుకోలేదు. ఇక రెండోది-జనరల్ నాలెడ్జ్ లేకుండా పోయింది. పొద్దున్న ఐదింటికి వెళితే తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకోలేదు." అని కోట అన్నారు.