తెలంగాణలో కాంగ్రెస్, MIM, BRS మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్ కుమార్ నబీన్ ఆరోపించారు. మంగళవారం మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ భేటీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన సాగిస్తోందని విమర్శించారు. తెలంగాణలో RR ట్యాక్స్ విధిస్తున్నారని, ఇక్కడి నుంచి ఢిల్లీకి డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. బీజేపీ వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.