కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు గత రాత్రి ఆర్‌జి కర్ ఆసుపత్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. విధ్వంసకారులు బయటి వ్యక్తులని, విద్యార్థుల ఉద్యమంతో వారికి సంబంధం లేదని అన్నారు. 'బామ్ అండ్ రామ్'కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసినట్లు నాకు సమాచారం అందింది" అంటూ బీజేపీ, సీపీఐ(ఎం) ప్రమేయాన్ని సూచించారు.