తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు తన కుటుంబమని కేసీఆర్ భావిస్తే.. కేవలం ఆ నలుగురి కోసమే తెలంగాణ వచ్చిందంటూ ప్రత్యర్థులు విషప్రచారం చేశారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఇక రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, తాము ఎల్లప్పుడూ అధికారంలోనే ఉంటామని ఎవరైనా భావిస్తే వారు మూర్ఖులేనని హితవు పలికారు.