రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవించి ఉంటే, బీజేపీని దేశంలో లేకుండా చేసేవారని లేదా మావోయిస్టు పార్టీల మాదిరిగా నిషేధించేవారని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ ఒక్కటే ఉండాలనే రీతిలో రాజకీయాలు చేయడం ప్రాంతీయ పార్టీలకు ఆందోళనకరమని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గెహ్లాట్ పేర్కొన్నారు. యూపీలో ముస్లింలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడా ఇవ్వకుండా, కేవలం హిందుత్వ అజెండాతోనే బీజేపీ ముందుకు వెళ్తోందని, దేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారా, లౌకికవాదం ఏమైందని ఆయన ప్రశ్నించారు.