టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఐపీడీఎస్ ప్రతినిధిగా చెప్పుకున్న తిరునావుక్కరసు అనే వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. ఎమ్మెల్యే నిరాకరించడంతో, ఆయన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. ఈ ఘటనపై ఉత్తంగరై ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. విచారణలో, తిరునావుక్కరసుతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్‌ల ఆదేశాలతోనే ఫోన్ చేసినట్లు విచారణలో తేలింది.