AP: సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలులో దోపిడీకి పాల్పడిన కేసులో ముగ్గురిని రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు రూరల్ మండలం సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చామ్‌రాజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. నలుగురు ప్రయాణికుల వద్ద నగలు, బంగారం దోచుకున్నారు. ఈ కేసులో యూపీకి చెందిన ఇద్దరిని, కర్ణాటకకు చెందిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.