రూ.1 కోటి ఇస్తే.. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గువాహటిలోని ఖానాపారా వెర్నరీ అండ్ అగ్రికల్చర్ మైదానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా లైవ్ చాట్ సెక్షన్‌లో.. తనకు రూ.1 కోటి ఇస్తే హిమంత బిశ్వ శర్మను చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అధికారులు అప్రమత్తమై బెదిరించిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.