శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో నల్లనేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు బాలురు నీటి గుంతలో పడి మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో బాలుర కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.