AP: ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని మందలించినందుకు అన్నదమ్ములపై ముగ్గురు యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో ముగ్గురు యువకులు అతివేగంగా బైక్ నడిపి వాహనాన్ని ఢీకొట్టారు. ఎందుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని యువకులను అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు మందలించారు. దాంతో కక్ష పెంచుకున్న ముగ్గురు యువకులు అన్నదమ్ములపై కత్తులతో దాడికి తెగబడ్డారు. గాయపడిన అన్నదమ్ములను ఆస్పత్రికి తరలించారు.