దీపావళి పండుగ రోజు ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తుండగా ముగ్గురు సోదరులు మునిగిపోయారు. ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసులు, గజ ఈతగాళ్లు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం మరో యువకుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.