AP: విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెరకముడిదాం మండలం బుధరాయవలసలో ఉన్న కోనేరులో స్నానానికి దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు వెంకటేశ్, హేమచంద్రరావు, చందుగా గుర్తించారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.