AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం స్నానం చేయడానికి బాత్‌రూంలోకి ముగ్గురు చిన్నారులు వెళ్లారు. వాటర్ గీజర్‌లో విపరీతంగా ఉన్న వేడి నీటిని బకెట్‌లో పట్టారు. బాత్‌రూంలో ఆవిరి విస్తరించి ఊపిరాడక కిందపడిపోయారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.