ముంబై ఇండియన్స్ (MI) జట్టు కోచింగ్ స్టాఫ్ నుండి ముగ్గురు కీలక వ్యక్తులు తప్పుకున్నారు. బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మంబ్రేతోపాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ ఫ్రాంచైజీకి వీడ్కోలు పలికారు. ప్లేయర్, కోచ్‌గా సుదీర్ఘకాలం జట్టుతో ఉన్న మలింగ, నాలుగు ఐపీఎల్ టైటిళ్లు, 2011 ఛాంపియన్స్ లీగ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్థానంలో పొలార్డ్‌ను జట్టు యాజమాన్యం నియమించిన క్రమంలో, ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.