AP: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. అతిసారంతోనే చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి కలుషిత నీరు కారణంగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ఆత్మకూరులో నీటిని పరీక్షలకు పంపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమను కాపాడాలని స్థానికులు వాపోతున్నారు.