3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఆత్మహత్య.. అందులో ఇద్దరు అమ్మాయిలే!

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ గ్రామంలో 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి. వైష్ణవి (18) మంగళవారం ఉరివేసుకుంది. ఆమె స్నేహితుడు రాకేష్‌ (21) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మరో స్నేహితురాలు శ్రీజ (18) కూడా ఉరివేసుకుని చనిపోయింది. వరుస మరణాల వెనుక కారణం ఏమిటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్