AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.