TG: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు తెలంగాణ వాసులు మరణించారు. సిద్ధిపేటకు చెందిన రోహిత్ రెడ్డి భార్య ప్రగతి రెడ్డి, అత్త సునీత(56) ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రగతి రెడ్డి(35), అత్త సునీత (56), కుమారుడు హర్వీన్ (6) మృతి చెందగా రోహిత్ రెడ్డి, పెద్ద కుమారుడికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.