తిరుపతిలో క్రేన్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం (VIDEO)

AP: తిరుపతి నగరంలో బీబీఆర్‌ ఆస్పత్రి వద్ద క్రేన్‌ పనులు జరుగుతుండగా, అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్‌ కిందపడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕