తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

TG: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రఘువపూర్ వద్ద లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్