రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి సూసైడ్

TG: హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి- ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం. వీరిని బోడుప్పల్‌ హరితహారం కాలనీకి చెందిన విజయ, విశాల్ రెడ్డి, చేతనరెడ్డిగా గుర్తించారు. విజయ భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్