జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్‌ఛార్జులుగా ముగ్గురు మంత్రులు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులను ఈ ఉప ఎన్నిక ఇన్ఛార్జులుగా నియమించింది. ఒక్కో మంత్రి బృందంలో ఆరుగురు చొప్పున 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, 10 నుంచి 15 బూత్‌లకు ఒక కార్పొరేషన్ చైర్మన్‌ను నియమించనున్నారు.

సంబంధిత పోస్ట్